Telangana : ఆ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానివే

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదును చేస్తున్న భూములు ప్రభుత్వానివేనని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది;

Update: 2025-03-31 06:58 GMT
government, statement, lands, hyderabad central university
  • whatsapp icon

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదును చేస్తున్న భూములు ప్రభుత్వానివేనని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. న్యాయస్థానాల్లో కూడా అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపింది. ఆ ప్రాజెక్ట్ లో సెంట్రల్ యూనివర్సిటీ భూములు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అభివృద్ధి జరగాలంటే కొన్ని భూములను చదును చేయడంలో తప్పులేదని తెలిపింది.

ఎవరు అడ్డుకున్నా...
అదే సమయంలో ఈ కార్యక్రమాన్ని ఎవరు అడ్డుకున్నా అది కోర్టు థిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది. ఈ నాలుగు వందల ఎకరాల భూమి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానిదేనని, యాజమాన్య హక్కులు కూడా ప్రభుత్వానికే ఉన్నాయని, ఇందులో మరొక సందేహం లేదని తెలిపింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు కూడా లేదని స్పష్టం చేసింది.


Tags:    

Similar News