UPI Fraud యూపీఐ ఫ్రాడ్ జరుగుతోంది.. జర జాగ్రత్త
యూపీఐ ఫ్రాడ్ జరుగుతోంది.. చాలా జాగ్రత్త
క్యూఆర్ కోడ్‌ల ద్వారా డిజిటల్ చెల్లింపులు సాధారణంగా చేస్తూ ఉంటారు. చాలా షాపుల ముందు ఆయా షాపు యజమానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ను యూపీఐ పేమెంట్స్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొందరు దుండగులు ఒక పథకాన్ని రూపొందించి సరికొత్త సైబర్ మోసానికి పాల్పడుతూ ఉన్నారు. ఓనర్ లకు సంబంధించిన యూపీఐ స్కానర్ల పైన కేటుగాళ్లు తమకు సంబంధించిన క్యూఆర్ కోడ్ లను అతికించేసి వెళ్లిపోతున్నారు. హైదరాబాద్‌లోని చిరు వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు తెగబడుతూ ఉన్నారు.
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఈ మోసం బయటపడింది, ఈ మోసపూరిత వ్యూహానికి చాలా మంది విక్రేతలు బలి అయ్యారు. ఈ పథకం వ్యాపారాలను ఆర్థికంగా ప్రభావితం చేయడమే కాకుండా డిజిటల్ చెల్లింపు పద్ధతులపై కస్టమర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, చిరు వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. వ్యాపార యజమానులు తమ QR కోడ్‌లను మార్చలేదని నిర్ధారించుకోవడానికి తరచుగా తనిఖీ చేయాలని సూచించారు. ఏదైనా లావాదేవీలను పూర్తి చేయడానికి ముందు కస్టమర్‌లు తమ పేమెంట్ యాప్‌లలోని వివరాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని సూచించారు. అదనంగా, లావాదేవీ నిర్ధారణల కోసం స్పీకర్‌లను ఉపయోగించాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు.