రెండేళ్ల తర్వాత హైదరాబాద్ లో హోలీ
గత రెండేళ్లుగా హైదరాబాద్ వాసులు హోలీ సంబరాలకు దూరంగా ఉన్నారు. కరోనా కారణంగా పండగను జరుపుకోలేకపోయారు.
గత రెండేళ్లుగా హైదరాబాద్ వాసులు హోలీ సంబరాలకు దూరంగా ఉన్నారు. కరోనా కారణంగా పండగను జరుపుకోలేకపోయారు. అయితే ఈసారి కరోనా తీవ్రత తగ్గడంతో హైదరాబాద్ వాసులు హోలీ సంబరాలను వేడుకగా జరుపుకుంటున్నారు. రెండేళ్ల తర్వాత హోలీ సంబరాలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందని నగరవాసులు చెబుతున్నారు. ఉదయం నుంచే రోడ్లపైన తిరుగుతూ రంగులు చల్లుకుంటున్నారు.
వాకర్స్ అసోసియేషన్.....
హైదరాబాద్ లోని ఇందిరాపార్కులో వాకర్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా హోలీ సంబరాలను జరుపుకుంటోంది. డీజే పాటలు పెట్టడంతో ఆ ప్రాంగణమంతా పండగ వాతావరణం సంతరించుకుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో గేటెడ్ కమ్యునిటిలో కూడా హోలీ సంబరాలను ప్రజలు జరుపుకుంటున్నారు.