కోట్ల వర్షం.. కోకాపేట్ లో

కోకాపేట నియో పోలిస్ భూములల్లో మల్టీపర్పస్ నిర్మాణాలు చేసుకోవడానికి అవకాశం ఉంది.

Update: 2023-08-03 14:03 GMT

కోకాపేట్ లోని నియో పోలీస్ లే అవుట్ లోని 45.33 ఎకరాల భూమి కోట్లు పలికింది. ఒక్కో బిట్ ఒక్కో ధరతో కోట్ల వర్షం కురిసింది. ఈ భూముల వేలంలో ఆల్ టైం రికార్డ్ 100.75 కోట్ల మార్క్ దాటింది. ఓ బిట్ లోని ఎకరం భూమి ధర ఇంత పలకడంతో అందరూ అవాక్కవుతూ ఉన్నారు. అత్యల్పంగా ఎకరం భూమి 51.75 కోట్లు పలికిందంటే కోకా పేట్ లో భూముల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర 35 కోట్లు కాగా.. పోటీ పడి మరీ భూమిని కొన్నారు. గతంలో కోకాపేటలో 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రెండువేల కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు కనిష్టంగా ఎకరా రూ.31 కోట్ల నుంచి అత్యధికంగా రూ.60 కోట్ల రూపాయల ధర పలికింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువే పలకడంతో రెండువేల నుండి రూ.2500 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరుతుందని హెచ్ఎండిఏ ఆశిస్తోంది.

కోకాపేట నియో పోలిస్ భూములల్లో మల్టీపర్పస్ నిర్మాణాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంతో భారీగా డిమాండ్ పెరిగింది. ఆఫీస్, రెసిడెన్షియల్ స్పేస్‌కు ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో.. అక్కడ భారీ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎయిర్పోర్ట్‌కు, సిటీకి అత్యంత దగ్గరలో ఉన్న భారీ లేఅవుట్ కోకాపేట నియో పోలిస్ లేఅవుట్ కావడంతో డిమాండ్ భారీగా పెరిగింది. అమ్మకానికి పెట్టిన కోకాపేట నియో పోలీస్ లేఔట్ లోని ప్లాట్ నెంబర్ 6లో 7 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 7 లో 6.55 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 8 లో 0.21 ఎకరాలు, ఫ్లాట్ నెంబర్ 9 లో 3.60 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 10 లో 3.60 ఎకరాలు, ఫ్లాట్ నెంబర్ 11 లో 7.53 ఎకరాలు, నాట్ నెంబర్ 14 లో 7.34 ఎకరాలతో కలిపి మొత్తం 45.33 ఎకరాల భూమిని హెచ్ఎండిఏ విక్రయిస్తోంది.


Tags:    

Similar News