Breaking : హైడ్రా కూల్చివేతలు ఆదివారం ప్రారంభం.. ఈసారి ఎక్కడంటే?

మొయినాబాద్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చి వేస్తున్నారు.

Update: 2024-08-18 05:35 GMT

మొయినాబాద్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చి వేస్తున్నారు. మూడు నుంచి నాలుగు అంతస్థుల భవనాలను హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చి వేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను చేపట్టారని గుర్తించిన హైడ్రా అధికారులు ఉదయం నుంచే కూల్చి వేతలు ప్రారంభించారు.

మొయినా బాద్ లో...
కూల్చివేతల సందర్భంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. భవన నిర్మాణ దారుల నుంచి ప్రతిఘటన రాకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకున్నారు. కూల్చివేతల సందర్భంగా ఆ ప్రాంతాల్లోకి ెఎవరనీ అనుమతించడం లేదు. చిలుకూరు గండిపేట చెరువులో ఎఫ్‌టీఎల్ లో నిర్మించిన భవనాలను కూల్చివేతలు కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News