Hyderabad : హైదరాబాదీలకు షాకిచ్చిన పోలీసులు.. 12 గంటలు దాటితే?

హైదరాబాద్ లో పోలీసులు ఎన్నికల దృష్ట్యా కఠిన చర్యలకు దిగారు. దుకాణాలకు కూడా సమయాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు

Update: 2023-11-19 11:48 GMT

హైదరాబాద్ లో పోలీసులు ఎన్నికల దృష్ట్యా కఠిన చర్యలకు దిగారు. దుకాణాలకు కూడా సమయాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలకు ఉదయం 9 గంట నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ మాత్రమే అనుమతి ఉంటుంది. తర్వాత మూసి వేయాలి. లేకుంటే చర్యలు తీసుకుంటారు. అలాగే పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్లకు ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకూ మాత్రమే అనుమతి ఉంటుంది. పన్నెండు గంటల తరువాత బార్స్ ను, పబ్స్ ను మూసివేయాల్సిందే. 

వైన్ షాపులను...

అలాగే వైన్ షాపులను ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా పదకొండు గంటలకు వైన్ షాపులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే కేసులు నమోదు చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తర్వలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News