Telangana : తెలంగాణ పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు

అల్లు అర్జున్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.;

Update: 2025-01-02 02:27 GMT

అల్లు అర్జున్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మావవహక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సంథ్యా థియేటర్ లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ రేవతి మరణించగా, బాలుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

లాఠీఛార్జి చేసిన పోలీసులను...
అయితే సంధ్య థియేటర్ దగ్గర లాఠీ ఛార్జ్ చేసిన పోలీసుల పై చర్యలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. న్యాయవాది రామారావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్ కు ఆదేశాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ కోరింది. పోలీసుల లాఠీఛార్జీ వల్లనే తొక్కిసలాట జరిగిందన్న దానిపై వివరణ ఇవ్వాలన్న కోరింది.


Tags:    

Similar News