ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం ఎంతో తెలుసా?

ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం ఈ ఏడాది భారీగా పెరిగింది. కోటి పది లక్షల రూపాయల వరకూ ఆదాయం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు

Update: 2024-09-17 04:09 GMT

ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం ఈ ఏడాది భారీగా పెరిగింది. కోటి పది లక్షల రూపాయల వరకూ ఆదాయం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. 70 ఏళ్లు గడిచిన సందర్భంగా డెబ్భయి అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఈసారి ఏర్పాటు చేశారు. అయితే ఈసారి హుండీ ద్వారా ఖైరతాబాద్ గణేశుడికి 70 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

ప్రకటనల ద్వారా...
అదే సమయంలో ప్రకటనల ద్వారా మరో నలభై లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటి సమితి ప్రకటించింది. ఇంతటి రికార్డు స్థాయిలో ఈసారి ఖైరతాబాద్ గణేశుడికి ఆదాయం రావడంతో నిర్వాహకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరస సెలవులు రావడంతో లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి గణేశుడిని దర్శించుకున్నందున ఆదాయం ఈ ఏడాది పెరిగిందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News