Draupadi Murmu : నేడు హైదరాబాద్ కు ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. శీతాకాల విడిది కోసం ఆరు రోజుల పాటు హైదరాబాద్ లో ఉంటారు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి నేటి నుంచి ఆరు రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బసచేయనున్నారు. ఈ నెల 23వ తేదీ వరకూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లోనే ఉంటారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రపతి పర్యటించే చోట ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
వరస కార్యక్రమాలతో...
అయితే ఈ ఆరు రోజులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. డిసెంబరు 19న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. డిసెంబరు 20న యాదాద్రి భువనగిరి జిల్లలో పోచంపల్లిలో చేనేత మరియు స్పిన్నింగ్ యూనిట్ ను రాష్గ్రపతి సందర్శిస్తారు. 21న వివిధ ప్రాజెక్టులను ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. 22న వివిధ వర్గాల ప్రజలతో ఎట్ హోం రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు.