మాదాపూర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు

Update: 2023-08-11 13:45 GMT

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. దీంతో తోటి విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. వివ‌రాళ్లోకెళితే.. గంటా కనకరాజు అనే విద్యార్థి అయ్యప్ప సొసైటీలోని ప్రణవి క్యాంపస్ లోని నారాయణ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్ర‌వారం తాను చదువుతున్న క్యాంపస్ లోనే కనకరాజు ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యానుకు వేలాడుతున్న కనకరాజును చూసి విద్యార్థులందరూ భయభ్రాంతులకు గురై వెంటనే కాలేజీ యజమాన్యానికి సమాచారాన్ని అందించారు.

పోలీసుల‌కు స‌మాచారం అందించిన‌ కాలేజీ యజమాన్యం..కనకరాజును హుటా హుటిన హాస్పిటల్‌కు తరలించింది. కనకరాజును పరీక్షించిన వైద్యులు అప్పటికే.. అతను మృతి చెందినట్లుగా నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. మాదాపూర్ పోలీసులు కనకరాజు మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News