Hyderabad : "హైడ్రా" దడ దడ లాడిస్తుందిగా.. అక్రమార్కుల వెన్నుల్లో వణుకుగాక మరేంటి?

హైదరాబాద్ లో ఆక్రమణదారులకు వణుకు మొదలయింది. "హైడ్రా" దూకుడుతో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు.

Update: 2024-08-16 12:08 GMT

హైదరాబాద్ లో ఆక్రమణదారులకు వణుకు మొదలయింది. "హైడ్రా" దూకుడుతో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ చెరువు స్థలాలను, ప్రభుత్వ భూములను కబ్జా చేసేసి ఆక్రమించుకుని ఆకాశహార్మ్యాలు కట్టిన బిల్డర్ల తాట తీస్తన్నారు. అక్రమ నిర్మాణం అని తేలితే చాలు వెంటనే కూల్చి వేస్తున్నారు. అక్రమంగా కట్టడాన్ని నిర్మిస్తే చాలు వాటిని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు హైడ్రా అధికారులు. హైదరాబాద్ మహానగరంలో చెరువుల భూములను, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వాటిని నేలమట్టం చేస్తున్నారు. ఒక్క సమాచారం ఎవరు ఇచ్చినా వెంటనే అక్కడకు వాలిపోయి కూల్చివేతలను ప్రారంభిస్తున్నారు.

అక్రమ నిర్మాణాలను...
ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, పార్క్ స్థలాలు, బఫర్ జోన్లలో అక్రమనిర్మాణాలను కూల్చి వేసేందుకు "హైడ్రా"ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్ట్ ఏజెన్సీ గా నామకరణం చేశారు. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించేందుకు ఈ సంస్థక ఛైర్మన్ గాముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తారు. హైడ్రా కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాధ్ నియమితులయ్యారు. ఇక చూస్కోండి. అప్పటి నుంచి హైడ్రాకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి.వాటిని మ్యాప్ ద్వారా పరిలించి ఆక్రమణలు అన్న తేల్చుకున్న తర్వాతనే వాటినికూల్చి వేస్తున్నారు.
స్పష్టమైన ఆదేశాలుండటంతో....
హైడ్రా ఛైర్మన్ రేవంత్ రెడ్డికూడా ఈవిషయంలో సీరియస్ గాఉండటంతో ఆయన వద్దకు వెళ్లి పైరవీలు చేేసేందుకు అవకాశం లేదు. రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాధ్ కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆయన ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుని ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాత్రి పన్నెండు గంటలకు మొదలెట్టి న్యాయస్థానాలను ఆశ్రయించకుండా హైడ్రా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా బాచుపల్లిలో ఉన్న మల్టీ ప్లెక్స్ భవనాన్నికూల్చి వేశారు. అంతేకాదు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దానం నాగేందర్ రంగనాధ్ పై కొంత పరుష వ్యాఖ్యలు చేసినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. సో.. మీ ప్రాంతంలో ఆక్రమణలున్నాయా? అయితే వెంటనే హైడ్రాకు ఫిర్యాదు చేయండి. ప్రభుత్వ స్థలాలు రక్షించినవారవుతారు.


Tags:    

Similar News