హైదరాబాద్ ఎగ్జిబిషన్ తిరిగి ప్రారంభం... ఈ నెల 25వ తేదీ నుంచి?

ఈ నెల 25వ తేదీ నుంచి ఎగ్జిబిషన్ ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. మార్చి నెలాఖరు వరకూ నుమాయిష్ కొనసాగే అవకాశముంది.

Update: 2022-02-15 01:53 GMT

ప్రతి ఏటా హైదరాబాద్ లో జరిగే ఎగ్జిబిషన్ కు ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏటా జనవరిలో ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ దాదాపు నలభై రోజులు సాగుతుంది. అయితే ఈసారి కోవిడ్ తీవ్రత కారణంగా ప్రారంభించిన ఎగ్జిబిషన్ ను వాయిదా వేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో వ్యాపారులు వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటారు. గవర్నర్ జనవరి 1వ తేదీన నుమాయిష్ ను ప్రారంభించారు. జనవరి 3వ తేదీన క్లోజ్ చేశారు.

మూసివేసిన....
అయితే ప్రభుత్వం ఆంక్షలు విధించిన కారణంగా ఎగ్జిబిషన్ ను నిర్వాహకులు వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం, ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయడంతో తిరిగి నుమాయిష్ ను ప్రారంభించాలని ఎగ్జిబిషన్ సొసైటీ నిర్ణయించింది. ఈ నెల 25వ తేదీ నుంచి ఎగ్జిబిషన్ ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. మార్చి నెలాఖరు వరకూ నుమాయిష్ ను కొనసాగే అవకాశముంది.


Tags:    

Similar News