‌‌Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లపై మొరాయిస్తున్న వాహనాలు

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. దాదాపు గంటన్నర నుంచి భారీవర్షం నమోదవుతుంది.

Update: 2024-06-27 12:07 GMT

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. దాదాపు గంటన్నర నుంచి భారీవర్షం నమోదవుతుంది. అనేక చోట్ల అత్యధిక వర్షంపాతం నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, బోరబండ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్ల్, అమీర్‌పేట్, పంజాగుట్ట, రామాంతపూర్, ఉప్పల్, సరూర్ నగర్, ఎల్‌.బి.నగర్, వనస్థలి పురంలలో భారీ వర్షం నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అనేక చోట్ల భారీ వర్షం కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

వాహనాల రాకపోకలకు...
వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. విధులు ముగించుకుని ఇంటికి వద్దామనుకున్న వారంతా వర్షంతో ఆఫీసులకే పరిమితమయ్యారు. రోడ్ల మీద మోకాళ్ల లోతులో నీరు నిలిచి ఉండటంతో వాహనాలు రోడ్లపైనే మొరాయిస్తున్నాయి. దీంతో అనేక అవస్థలు పడుతున్నారు. ఒక్కసారిగా పడిన వర్షంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఇబ్బందులు పడలేక చిరు వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. మ్యాన్‌హోల్ మూతలను ఎవరూ తొలగించవద్దని జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రమే తొలగిస్తారని, అలాకాకుండా ఎవరైనా మ్యాన్ హోల్ మూతలను తీస్తే తగిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు.


Tags:    

Similar News