హైదరాబాద్ లో ఐటీ సోదాలు.. ఒకేసారి 30 ప్రాంతాల్లో..
మాదన్నపేట్, కొండాపూర్, మెహదీపట్నం, శాస్త్రిపురంతో పాటు పలుచోట్లకు ఉదయం 6 గంటల నుండి సోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారుయ కోహినూర్ గ్రూప్ తో పాటు మరొ రియల్ ఎస్టేట్ కంపెనీలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న కోహినూర్ కంపెనీల్లో, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో, కంపెనీ ఎండీ మజీద్ ఇంటిలోనూ సోదాలు చేస్తున్నారు.
మాదన్నపేట్, కొండాపూర్, మెహదీపట్నం, శాస్త్రిపురంతో పాటు పలుచోట్లకు ఉదయం 6 గంటల నుండి సోదాలు జరుగుతున్నాయి. కోహినూర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పలు ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. కోహినూర్ కంపెనీ.. ఒక రాజకీయ నాయకుడికి బినామీగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతనెవరు అనే దానిపైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోహినూర్ గ్రూప్ హైదరాబాద్ లో పెద్దఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది.