రేసు రద్దవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్

హైదరాబాద్ లో వచ్చే నెల జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు రద్దయింది

Update: 2024-01-06 07:26 GMT

KTR response on formula e cancelled by telangana government

హైదరాబాద్ లో వచ్చే నెల జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు రద్దయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్లే రేసును రద్దు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రేసు రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయమని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్ లు హైదరాబాద్ తో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయని.. ఇండియాకు ఈ-ప్రిక్స్ ని తీసుకురావడానికి తాము ఎంతో కృషి చేశామని, చాలా సమయాన్ని వెచ్చించామని తెలిపారు. హైదరాబాద్ ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఎలెక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తిదారులు, స్టార్టప్ లు హైదరాబాద్ ను పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా గుర్తించాయని తెలిపారు.

హైదరాబాద్‌లో జరగాల్సిన ఈ-రేస్ సీజన్ 10 నాలుగో రౌండ్ ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగనుండగా.. అయితే ఫార్ములా వన్ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ శాఖ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని నిర్వాహకులు తెలిపారు. గతేడాది అక్టోబర్ 30న చేసుకున్న ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


Tags:    

Similar News