Hyderabad : పాతబస్తీలో భారీగా ఓట్ల తొలిగింపు

హైదరాబాద్ నగరంలో భారీగా బోగస్ ఓట్లు తొలగించారు. పాతబస్తీలో అత్యధికంగా ఓట్లు తొలగించారు;

Update: 2024-04-22 07:40 GMT
Hyderabad : పాతబస్తీలో భారీగా ఓట్ల తొలిగింపు
  • whatsapp icon

హైదరాబాద్ నగరంలో భారీగా బోగస్ ఓట్లు తొలగించారు. ఇప్పటివరకు ఐదు లక్షలకుపైగా నకిలీ ఓట్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారులు తొలగించారు. హైదరాబాద్ నగరంలో భారీగా బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో భాగంగా దొంగ ఓటర్లను గుర్తించింది.

నకిలీ ఓట్లను గుర్తించి...
అయితే హైదరాబాద్ నగరంలో 54,259 నకిలీ ఓట్లు, చనిపోయినవారు 47 వేలు, 4,39,801 ఇండ్లు మారిన వారి ఓట్లు తొలగించినట్లు తెలిసింది. నకిలీ ఓట్లలో అత్యధికంగా మైనార్టీ ఓటర్లు ఉన్నట్టు గుర్తించారు. పాతబస్తీలోని ఎంఐఎం ప్రభావిత ప్రాంతాల్లో అధికంగా నకిలీ ఓట్లను తొలగించినట్లు తెలిసింది. పాతబస్తీలో దొంగ ఓట్లపై ఈసీకి భారీగా ఫిర్యాదులు అందాయి. 


Tags:    

Similar News