హైదరాబాద్ కు భారీ వర్ష సూచన

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ నగరవాసులను అప్రమత్తం చేసింది.

Update: 2022-06-14 12:28 GMT

హైదరాబాద్ లో మరి కాసేపట్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ నగరవాసులను అప్రమత్తం చేసింది. అధికారులు అప్రపత్తమంగా ఉండాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షం నమోదయ్యే అవకాశముండటంతో లోతట్టు ప్రాంతాలు మాత్రమే కాకుండా, మ్యాన్ హోల్స్ వద్ద పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

జీహెచ్ఎంసీ అప్రమత్తం...
హైదరాబాద్ లో ఇప్పటికే మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షం కురిసే అవకాశమున్నందున నగరవాసులు వీలయినంత వరకూ ఇంట్లోనే ఉండాలని, బయటకు రావద్దని సూచనలు జారీ చేసింది.


Tags:    

Similar News