Hyderabad : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సంస్థ యజమాన్యం గుడ్ న్యూస్ అందించింది. మెట్రో రైలు వేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సంస్థ యజమాన్యం గుడ్ న్యూస్ అందించింది. మెట్రో రైలు వేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ రాత్రి పదకొండు గంటల వరకూ మాత్రమే మెట్రో రైళ్లు నగరంలో చివరి రైలుగా ఉండేది. అయితే ఇకపై11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉంటుందని మెట్రో రైలు యాజమాన్యం ప్రకటించింది. ప్రతి రోజూ ఉదయం ఆరు గంటల నుంచి మెట్రో రైళ్లు ప్రారంభమవుతాయి.
సోమవారం ఉదయం మాత్రం...
ఇక నుంచి ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే మెట్రో రైళ్లు నడుస్తాయని తెలిపారు. మెట్రో రైళ్ల రాకపోకల సమయం పెంచినట్లు యాజమాన్యం తెలిపింది. మిగిలిన రోజుల్లో మాత్రం ఆరు గంటలకే మెట్రో రైళ్లు నడుస్తాయి. రైళ్లలో ఇటీవల పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. సవరించిన వేళలు నిన్నటి నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది.