మంత్రి కేటీఆర్‌తో ఎంఐఎం నేతల భేటీ
హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం నేతలు వరసగా బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ తో భేటీ అవుతున్నారు.
హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం నేతలు వరసగా బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ తో భేటీ అవుతున్నారు. పట్టభద్రుల స్థానంలో జరగనున్న ఎమ్మెల్సీ స్థానంలో ఎంఐఎం తిరిగి పోటీ చేయడానికి రెడీ అవుతుంది. తెలంగాణలో రెండు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. మార్చి 13వ తేదీన ఎన్నిక జరగనుంది. మార్చి 16న కౌంటింగ్ జరగనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికపైనే....
తెలంగాణలో ఒక స్థానిక, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానిక జరగనుంది. హైదరాబాద్ స్థానిక కోటా కింద జరగుతున్న ఎన్నికల్లో ఎంఐఎం తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. దీనిపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ తో అక్బరుద్దీన్ సమావేశమయ్యారు. అంతకు ముందు కేటీఆర్ తో పాతబస్తీ అభివృద్ధి పనులపై అక్బరుద్దీన్ చర్చించారని చెబుతున్నా ఎమ్మెల్సీ స్థానంపైనే చర్చించారని తెలుస్తోంది. ఈ స్థానాన్ని బీఆర్ఎస్ ఎంఐఎంకు వదిలేస్తుందా? లేదా పోటీ చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల అసెంబ్లీలో ఇరు పార్టీల మధ్య జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.