Allu Arjun : అల్లు అర్జున్ ఇంటికి చేరిన వెంటనే?
సినీ హీరో అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి చేరిన వెంటనే భావోద్వేగానికి గురయ్యారు.
సినీ హీరో అల్లు అర్జున్ ఇంటికి చేరిన వెంటనే భావోద్వేగానికి గురయ్యారు. తన భార్యా బిడ్దలను హత్తుకుని ఆయన తన మనసులో ఉన్న వేదనను వెళ్లగక్కినట్లు కనిపిస్తుంది. అల్లు అర్జున్ ఉదయం 6.45 గంటలకు చంచల్ గూడ జైలు నుంచి విడుదలయిన అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తన కోసం వేచి ఉన్న సన్నిహితులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లను కలసి కొద్దిసేపు మాట్లాడారు.
ఇంటి బయటే...
దాదాపు గంటన్నరపాటు గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే ఉన్న అల్లు అర్జున్ అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ లోనిఆయన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన తొలుత తన భార్య ను ఆలింగనం చేసుకున్నారు. అల్లు అర్జున్ భార్య ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం తన కుమార్తెను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. అనంతరం కుమారుడిని దగ్గరకు తీసుకున్నారు. తర్వాత తన సమీప బంధువులతో కలసి ఇంట్లోకి వెళ్లిపోయారు.