NIA Raids: హైదరాబాద్‌లో ఉగ్రవాదుల భారీ ప్లాన్
హైదరాబాదులో మరోసారి ఎన్‌ఐఏ ఎ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న సానుభూతి ..
హైదరాబాదులో మరోసారి ఎన్‌ఐఏ ఎ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న సానుభూతి పరుల వేటలో సౌత్ రాష్ట్రాలను టార్గెట్ చేసింది ఎన్ఐఏ. అయితే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ భారీ ఎత్తున సోదాలు నిర్వహించింది. సోదాలలో భయభ్రాంతులకు గురి చేసే అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో మొత్తం 31 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఎన్‌ఐఏ పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. హైదరాబాద్ సైబారాబాద్ ప్రాంతాల్లో ఐదు చోట్ల తనిఖీలు చేపట్టంది. అదుపులో ఉన్న వారంతా యువకులే. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాలిఫట్ ఐడియాలజీని ప్రమోట్ చేస్తున్నట్టు ఎన్ఐఏ విచారణలో తేలింది. వీరంతా ఒక సమూహంగా ఏర్పడి ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో బట్టబయలైంది. గత ఏడాది అక్టోబర్ 23న కోయంబత్తూరులో ఒక గుడికి సమీపంలో కార్ పేలుడు సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఎన్ ఐ ఎ రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది.
మొత్తం 13 మందిని అరెస్ట్ చేసిన అధికారులు దర్యాప్తులో కీలక విషయాలు రాబట్టింది. కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో శనివారం ఉదయం తెలంగాణ తమిళనాడులో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పలువురు ఉగ్రవాద సానుభూతిపరులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ సైబరాబాద్ ప్రాంతాల్లో ఐదుగురు ఉగ్రవాద సానుభూతిపరులను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుంది. సోదాల్లో కీలక పత్రాలతో పాటు భారీగా నగదును స్వాధీనం చేసుకుంది. 60 లక్షల రూపాయల నగదు తో పాటు 18 వేల అమెరికన్ డాలర్లను ఎన్ ఐ ఎ స్వాధీనం చేసుకుంది. అయితే వీరు హైదరాబాద్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు ప్లాన్ చేసినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.