Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో టికెట్‌ బుకింగ్‌.. ఎలాగంటే..

టెక్నాలజీ రోజురోజుకు మరింతగా అభివృద్ధి చెందుతోంది. బయటకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి స్మార్ట్‌ ఫోన్‌లో ఇంటర్నెట్‌ సహాయంతో

Update: 2024-03-08 12:11 GMT

టెక్నాలజీ రోజురోజుకు మరింతగా అభివృద్ధి చెందుతోంది. బయటకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి స్మార్ట్‌ ఫోన్‌లో ఇంటర్నెట్‌ సహాయంతో పలు రకాల పనులను చేసుకునే టెక్నాలజీ వచ్చేసింది. బస్సు టికెట్స్‌, ట్రైన్‌ టికెట్స్‌, సినిమా టికెట్స్‌ ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల సేవలను ఇంట్లోనే ఉండి పొందవచ్చు. ఇంక అసలు విషయానికొస్తే హైదరాబాద్‌ నగరంలో మెట్రో సేవలు జనాలకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నగరంలో ట్రాఫిక్‌ తలనొప్పిని తప్పించుకునేందుకు చాలా మంది మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. అయితే మొదట్లో కౌంటర్‌ టికెట్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. మెట్రో స్టేషన్‌కు వెళ్లాక ఆన్‌లైన్‌లో అంటే ఫోన్‌పే, పేటీఎం ఇతర యాప్స్‌ ద్వారా బుకింగ్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఇప్పుడు మెంట్రో సేవలు మరింతగా సులభతరం కానున్నాయి.

అయితే తాజాగా నేరుగా వాట్సాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం తీసుకొచ్చారు. మరి వాట్సాప్‌లో టికెట్స్‌ బుకింగ్‌ చేసుకోవడం ఎలాగో చూద్దాం.

➦ ముందుగా ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 918341146468 నెంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి. అనంతరం ఈ నంబర్‌కు వాట్సాప్‌ 'Hi' అని మెసేజ్‌ చేయాలి.

➦ వెంటనే మీకు ఒక ఓటీపీతో పాటు ఈ టికెట్‌ బుకింగ్‌కు సంబంధించి ఒక యూఆర్‌ఎల్ గేట్‌వే వస్తుంది.

➦ ఈ టికెట్‌ బుకింగ్ URLలింక్‌పై క్లిక్‌ చేయగానే డిజిటల్‌ గేట్‌వే వెబ్ పేజీ ఓపెన్‌ అవుతుంది.

➦ ఇందులో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో మీ ప్రయాణ వివరాలు నమోదు చేసి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎమ్‌, రూపే డెబిట్‌ కార్డు వంటి వాటితో పేమెంట్ చేయాలి.

➦ పేమెంట్‌ పూర్తయిన తర్వాత మీకు మీ వాట్సాప్‌కు ఈ టికెట్‌ URL వస్తుంది.

➦ ఈ టికెట్‌ URLడౌన్‌లోడ్‌ చేసుకొని స్టేషన్‌లో క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేస్తే సరిపోతుంది. టికెట్‌ జనరేట్ అయిన తర్వాత 24 గంటలోపు ఉపయోగించుకోవచ్చు.

Tags:    

Similar News