విజయవాడకు టిక్కెట్ ఎంతంటే?

హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ బస్సులు కూడా సరిపడనంత రద్దీగా ఉంటుంది.

Update: 2023-01-09 03:37 GMT

సంక్రాంతి పండగ అంటే అందరూ సొంతూళ్లకు వెళతారు. ఎక్కడ ఉన్నా సొంతూరుకు వెళ్లి పండగ చేసుకోవాలని భావిస్తుంటారు. ఈ బలహీనతను ప్రయివేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. వాస్తవ ధర కంటే రెండు మూడు రెట్లు అధిక వసూళ్లు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నాయి.

అడ్డగోలు వసూళ్లు...
హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ బస్సులు కూడా సరిపడనంత రద్దీగా ఉంటుంది. ఇటు ఏపీఎస్ ఆర్టీసీ, అటు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నా ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సులు చాలడం లేదు. దీంతో ప్రయివేటు బస్సులకు పండగలా మారింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో నాలుగు వందల నుంచి ఆరు వందలు వసూలు చేస్తారు. ఇప్పుడు వెయ్యి రూపాయలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు.


Tags:    

Similar News