ఇండిగో విమానంలో ఎయిర్ హెస్టెస్ పట్ల?
ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్ పట్ల ఒక ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు
ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్ పట్ల ఒక ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన తో ఎయిర్ హోస్టెస్ సంబంధిత అధికారులుకు ఫిర్యాదు చేశారు. ఎయిర్ హోస్సెస్ ఫిర్యాదు మేరకు ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసభ్య ప్రవర్తన...
ప్రయాణికుడిని అదుపులో తీసుకొని ఎయిర్ పోర్టు పోలీసులు విచారిస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని సీరియస్ గా తీసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు అతనిని స్థానిక పోలీసులకు అప్పగించే అవకాశాలున్నాయి. ఇటీవల విమానాల్లో ఇలాంటి ఆకతాయి చేష్టలు ఎక్కువయ్యాయి.