రాష్ట్రపతి అభ్యర్థిపై ట్వీట్ చేసి చిక్కుల్లో వర్మ
తాజాగా అలా వర్మ చేసిన ట్వీట్ ఆయన్ను చిక్కుల్లోకి నెట్టింది. ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన
రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వివాదమే. ఆయన తీసే సినిమాల దగ్గర నుండి.. ట్వీట్ చేసే అంశాల గురించి కూడా వివాదాస్పదం అవుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు పోనీలే అని ఆయన్ను లైట్ తీసుకున్నా.. ఇంకొన్ని సార్లు మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంటుంది. తాజాగా అలా వర్మ చేసిన ట్వీట్ ఆయన్ను చిక్కుల్లోకి నెట్టింది. ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన సందర్భంగా 'ద్రౌపది రాష్ట్రపతి ' అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్ ఆమె మనోభావాలు దెబ్బతినేలా ఉన్నందున ఎస్సీ (SC), ఎస్టీ (ST) అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీజేపీ నాయకులు శుక్రవారం హైదరాబాద్లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి లు ఫిర్యాదు చేశారు. ఆమె మనోభావాలు దెబ్బతినేలా ఉన్నందున ఎస్సీ (SC), ఎస్టీ (ST) అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు. రాంగోపాల్ వర్మపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారని, అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కేసు నమోదు చేస్తామని అబిడ్స్ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు తెలిపారు.
ద్రౌపది ముర్ముపై ట్వీట్ విషయంలో రామ్గోపాల్ వర్మపై విమర్శలు రావడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. కేవలం వ్యంగ్యంతో చెప్పానని ఆర్జీవీ తెలిపారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కాదని.. వేరే విధంగా ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. మహాభారతంలోని ద్రౌపది నాకు చాలా ఇష్టమైన పాత్ర, అలాంటి పేరు చాలా అరుదు కాబట్టి కొన్ని సంబంధిత పాత్రలు గుర్తుకు వచ్చాయని వివరణ ఇచ్చారు.