రేపటి వరకూ రాజ్‌భవన్ రోడ్డు మూసివేత

భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ పర్యటనతో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు.

Update: 2022-07-03 06:17 GMT

భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ పర్యటనతో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. రాత్రికి రాజ్‌భవన్ లో మోదీ బస చేయనున్నారు. రాజ్‌భవన్ రోడ్డును రేపు ఉదయం 8 గంటల వరకూ మూసివేశారు. అటువైపు రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఇక ఈరోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభ దృష్ట్యా కూడా అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ ఆంక్షలు....
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మోదీ బహిరంగ సభ ఉండటంతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మహాత్మాగాంధీ రోడ్, ఆర్‌పీ రోడ్డు, ఎస్‌డీ రోడ్డుతో పాటు పరేడ్ గ్రౌండ్ కు మూడు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులు చిలకలకూడా పదో ప్లాట్‌ఫారం నుంచి స్టేషన్ కు చేరుకోవాల్సి ఉంటుంది. కరీంనగర్, హైదరాబాద్ నుంచి వచ్చే వారు అవుటర్ రింగ్ రోడ్డు నుంచి హైదరాబాద్ నగరంలోకి చేరుకోవాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News