అక్బరుద్దీన్ పై కేసు.. ఆయన ఏమంటున్నారంటే?

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది

Update: 2023-11-22 13:11 GMT

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పోలీసు అధికారిని దూషించిన కేసులో అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి లలితా బాగ్ కాలనీలో జరిగిన సభలో అక్బరుద్దీన్ ప్రసంగిస్తుండగా సమయానికి ప్రసంగం ముగించాలని సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అక్బరుద్దీన్ కోరారు. దీనిపై అక్బర్ రుసరుసలాడారు. తన వద్ద వాచ్ ఉందని, మీ వాచ్ సరిచూసుకోవాలని కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

పోలీసు అధికారిపై...
అంతే కాదు తాను ఇంకా ఐదు నిమిషాలు మాట్లాడతానని, తన ప్రసంగాన్ని ఎవరూ ఆపలేరని కూడా అక్బరుద్దీన్ సవాల్ విసిరారు. ఇన్స్‌పెక్టర్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా గట్టిగా హెచ్చరించారు. దీనిపై ఆర్పీ యాక్ట్ కింద అక్బరుద్దీన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అక్బరుద్దీన్ మాత్రం ఎన్నికల నిబంధనల ప్రకారమే తన ప్రసంగం కొనసాగిస్తుండగా, పదే పదే కావాలని అడ్డుకోవాలని ఆ ఇన్స్‌పెక్టర్ ప్రయత్నించాడన్నారు. తనను ఆపే దమ్మున్నోడు ఎవడూ లేడని, తాను సైగ చేస్తే చాంద్రాయణగుట్ట నుంచి పరుగెత్తాల్సిందేనని అన్నారు. ఇది సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. అయితే తాను అధికారిని దూషించలేదని, తనను కావాలని అడ్డుకోవాలని ప్రయత్నించినందునే తాను సమాధానం చెప్పానని, సదరు అధికారిపై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశానన్నారు అక్బరుద్దీన్.


Tags:    

Similar News