‌Hyderabad : నేడు హైదరాబాద్‌లో ఇటు వైపు వెళ్లకపోవడమే బెటర్.. ట్రాఫిక్ ఆంక్షలున్నాయ్

హైదరాబాద్ లో నేడు అనేక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు

Update: 2024-09-19 04:10 GMT

హైదరాబాద్ లో నేడు అనేక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలను నగరంలోని పలు ప్రాంతాల్లో విధించారు. ఈ ప్రాంతాల్లో వెళ్లకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. ఫలక్‌నుమా నుంచి వోల్లా వరకూ ట్రాఫిక్ ను అనుమతించరు.

ఈ మార్గాల ద్వారా....
అలాగే పాషా దర్గా నుంచి వోల్టా హోటల్ వరకూ, మక్కా మసీదు నుంచి హజ్ హౌస్ వరకు, ఊరేగింపులు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. దీంతో పాటు అలియాబాద్ ఎక్స్ రోడ్స్, లాల్ దర్వాజా క్రాస్ రోడ్స్, చార్మినార్, గుల్జార్ హౌస్, మదీనా, నయాపూల్, సాలార్ జంగ్ మ్యూజియం, పురానీ హవేలీ మీదుగా ర్యాలీ కొనసాగుతుండటంతో ఇక్కడ ట్రాఫిక్ ను అనుమతించరు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచిస్తున్నారు.


Tags:    

Similar News