హుస్సేన్ సాగర్ ప్రమాదంలో యువకుడు మిస్సింగ్
ట్యాంక్ బండ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక యువకుడు మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది;

ట్యాంక్ బండ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక యువకుడు మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. నిన్న హుస్సేన్ సాగర్ లో బాణాసంచా పేలి రెండు బోట్లు దగ్ధం అయిన సంగతి తెలిసిందే. అయితే ఒక్క బోటు లో అజయ్ అనే యువకుడు ఫ్రెండ్స్ తో వచ్చినట్లు చెబుతున్నారు. ఇరవై ఒక్కసంవత్సరాలు వయసున్న అజయ్ అనే యువకుడు అప్పటి నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
పోలీసుల వెదుకులాట...
హైదరాబాద్ లోని నాగారానికి చెందిన అజయ్ తన స్నేహితులతో కలసి హుస్సేన్ సాగర్ కు వచ్చారు. అయితే అజయ్ తో వచ్చిన స్నేహితుందరూ సురక్షితంగా ఉన్నప్పటికీ నిన్న ఘటన జరిగిన నాటి నుంచి అజయ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం గాయపడి ఏ ఆసుపత్రిలో లేరని చెబుతున్నారు. మరి అజయ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.