మోకిలా పోలీస్ స్టేషన్ కు రాజ్ పాకాల

మోకిలా పోలీస్ స్టేషన్ కు రాజ్ పాకాల హాజరయ్యా

Update: 2024-10-30 06:59 GMT

మోకిలా పోలీస్ స్టేషన్ కు రాజ్ పాకాల హాజరయ్యారు. ఫామ్ హౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాల ఈరోజు పోలీసుల ఎదుటకు హాజరయ్యారు. రాజ్ పాకాలను మోకిలా పోలీసులు విచారణ చేస్తున్నారు. నిజానికి విజయ్ మద్దూరి, రాజ్ పాకాలను కలిపి విచారించాలని పోలీసులు భావించినా విజయ్ మద్దూరి అందుబాటులోకి రాలేదు.

హైకోర్టు ఆదేశాలతో...
రాజ్ పాకాలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో తాను విచారణకు హాజరవుతానని రాజ్ పాకాల మోకీలా పోలీసులకు తెలిపారు. తన న్యాయవాదితో కలసి విచారణకు హాజరయ్యారు. ఆయనను ప్రస్తుతం మోకిలా పోలీసులు విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News