SuperMarket: కుళ్లిన ఉల్లిపాయలను అమ్ముతున్న ప్రముఖ సూపర్ మార్కెట్‌

FoSCoS యాప్‌ లో ఫిర్యాదులు అందడంతో ఆహార భద్రత అధికారులు

Update: 2024-07-26 05:05 GMT

FoSCoS యాప్‌ లో ఫిర్యాదులు అందడంతో ఆహార భద్రత అధికారులు బోడుప్పల్‌లోని ఆకృతి టౌన్‌షిప్‌లోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌ను, సికింద్రాబాద్ రాంపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టిఫిన్ సెంటర్‌ లలో తనిఖీలు చేశారు. సూపర్‌మార్కెట్‌లో విక్రయానికి ఉంచిన స్టాక్‌లో కుళ్లిన ఉల్లిపాయలను అధికారులు గుర్తించారు. “FSSAI లైసెన్స్ కాపీ ఆ ప్రదేశంలో ప్రదర్శించలేదు. ఫుడ్ హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు” అని తెలంగాణ ఆహార భద్రతా విభాగం ట్వీట్ చేసింది.

ప్రాంగణంలో FoSTaC శిక్షణ పొందిన సూపర్‌వైజర్ కూడా లేరని అధికారులు గుర్తించారు. ఇక టిఫిన్ సెంటర్ వద్ద ఆహార పదార్థాలను రోడ్డు పక్కన ఉంచడంతో పాటు వంట గదిలో అపరిశుభ్రతను గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్లు ఎలాంటి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకుండా అపరిశుభ్రమైన దుస్తులు ధరించినట్లు గుర్తించారు. నీటి ప్యూరిటీకి సంబంధించిన నివేదిక కూడా అందుబాటులో లేదు. ప్రస్తుతానికి నోటీసులు జారీ చేశామని.. తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News