స్టూడెంట్స్.. ఫుట్ బోర్డు ప్రయాణం.. స్పందించిన సజ్జనార్
విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్న్నారు.దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు
విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్న్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో కళాశాలలకు వెళ్లడానికి విద్యార్థులు బస్సుల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. విద్యార్థులు సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడం, సమయానికి రాకపోవడం వల్లనే తాము వచ్చిన బస్సుల్లోనే ఫుట్ బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.
అదనపు బస్సులు...
ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఆ రూట్లలో అదనపు బస్సులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో సరిపడా బస్సులు లేకనే తాము ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు చెప్పారు. ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని, దాని వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశముందని భావించి, రద్దీ ఎక్కువగా రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.