స్వప్నలోక్ అగ్నిప్రమాదం : ఆరుగురి మృతి
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించారు
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించారు. నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది వరగంల్ జిల్లా వాసులే. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఏడు, ఎనిమిద అంతస్థుల్లో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేగలిగారు. మృతులంతా చిన్న వయసు వారే.
మృతులు వీరే...
అయితే భవనంలో చిక్కుకుని ఊపిరాడక ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఐదు మంది వరంగల్ జిల్లాకు చెందిన వారు కాగా, ఒకరు ఖమ్మం జిల్లాకు చెందిన వారు. మృతులను శివ, త్రివేణి, వెన్నెల, శ్రావణి, ప్రమీల, ప్రశాంత్ లుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఎంత రక్షించాలని ప్రయత్నించినా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు ఫలించ లేదు. మంటల్లో చిక్కుకుపోయి ఊపిరి ఆడక మరణించారని చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని అభిప్రాయపడుతున్నారు.