మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళల కోసం లేడీస్ స్పెషల్ బస్సులను
మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళల కోసం లేడీస్ స్పెషల్ బస్సులను తీసుకుని వచ్చారు. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. లేడీస్ స్పెషల్ బస్సును ఆగస్టు 21 (సోమవారం) నుంచి ప్రారంభించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరి లక్డికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషాకిరణ్, గుట్టల బేగంపేట్, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్‌రోడ్స్ మీదుగా కొండాపూర్‌కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి రానుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కోఠి-కొండాపూర్ రూట్లో మహిళలకు ప్రత్యేక బస్సును ఆర్టీసీ నడపనుంది. 127కే నెంబర్‌తో నడిచే ఈ స్పెషల్ బస్సు ఈ సోమవారం నుండి ప్రారంభం కానుంది. ప్రతిరోజు ఉదయం గం.8.50కు కోఠి నుండి బయలుదేరుతుంది. లక్డీకాపూల్, మాసబ్ ట్యాంకు, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగం పేట, శిల్పారామం, కొత్తగూడ క్రాస్ రోడ్డు మీదుగా కొండాపూర్ వెళ్తుంది. మళ్లీ సాయంత్రం గం.5.45కు కొండాపూర్ నుండి అదే మార్గంలో కోఠికి వస్తుంది.