కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.;
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ప్రశ్నాపత్రం లీకయినా పరీక్ష రద్దు చేయకుండా ఒంటెత్తు పోకడలు వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాటుతున్న ఈ ప్రభుత్వం వెంటనే నీట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళనకారులను...
మంత్రి కిషన్ రెడ్డి ఇంటివద్దకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు.