హైదరాబాద్ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది

హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ భూమి పూజ చేశారు

Update: 2022-03-12 06:20 GMT

హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ భూమి పూజ చేశారు. ఈ సెంటర్ ఏర్పాటు వల్ల హైదరాబాద్ కు మరింత పేరు వస్తుందని చెప్పారు. సింగపూర్ తరహాలోనే హైదరాబాద్ కు ఈ సెంటర్ తో ప్రతిష్ట మరింత పెరుగుతుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్ కు భూమిని వెంటనే కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎంతో విలువైన గచ్చిబౌలిలో స్థలాన్ని కేటాయించారన్నారు.

ఏడాది లోపే....
ఆర్బిట్రేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణం మరో ఏడాదిలోనే పూర్తవుతుందని జస్టిస్ ఎన్వీరమణ ఆశాభావం వ్యక్తం చేశారు. భవన నిర్మాణం కోసం యాభై కోట్లు కేటాయించారని చెప్పారు. మధ్యవర్తిత్వం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కొహ్లి, హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ సతీష్ చంద్ర, మంత్రులు కేటీఆర్, ఇంద్రకిరణ్ రెడ్డి, మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాసగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News