Breaking : త్వరలో కుమారి ఆంటీ షాపుకు సీఎం రేవంత్ రెడ్డి
కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. స్ట్రీట్ ఫుడ్ ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపుపు మూసివేశారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. దీనిని వెనక్కు తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. స్ట్రీట్ ఫుడ్ స్టాల్ యజమాని కుమారి ఆంటీపై కేసు కూడా పోలీసులు నమోదు చేశారు.
తిరిగి దుకాణం తెరుచుకోవచ్చు...
త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ షాప్ కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. మాదాపూర్ లో గత కొంతకాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే నిన్న ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు చేసి రేవంత్ రెడ్డి స్పందించారు. తిరిగి యధాతధంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ను ఏర్పాటుచేసుకోవచ్చని తెలిపారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.