Hyderabad Biryani:ప్రపంచంలోనే హైదరాబాద్‌ బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు

Hyderabad Biryani: ప్రపంచంలో హైదరాబాద్‌ బిర్యానీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఈ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా..

Update: 2023-12-30 10:38 GMT

Hyderabad Biryani

Hyderabad Biryani: ప్రపంచంలో హైదరాబాద్‌ బిర్యానీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఈ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. బిర్యానీ అంటే ఈ రోజుల్లో ఇష్టపనడి వారు అంటే ఉండరేమో. లొట్టలేసుకునే తినేవాళ్లు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్‌పై జరిగిన ఓ సర్వేలో హైదరాబాద్‌ బిర్యానీ ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఇటీవల స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు వచ్చిన ఫుడ్‌లో కూడా హైదరాబాద్‌ బిర్యానీ ఉంది. ఇక తాజాగా, ట్రావెల్ గ్లోబల్.. ఈట్ లోకల్ అనే అంశంతో పని చేసే ప్రముఖ పర్యాటక ఆన్ లైన్ టేస్ట్ అట్లాస్ ప్రకటించిన ఉత్తమ ఆహార పరదార్థాల జాబితాలో కూడా మన హైదరాబాద్ బిర్యానీ స్థానం దక్కడ గమనార్హం.

అయితే సదరు కంపెనీ వివిధ దేశాలకు చెందిన నగరాలు.. అక్కడి ఫుడ్‌పై సర్వే నిర్వహించింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 నగరాల్లో మన హైదరాబాద్ బిర్యానీ 39వ స్థానం దక్కించుకోగా, ముంబై 35వ స్థానం దక్కించుకుంది. అలాగే ఢిల్లీ 56వ స్థానం, చెన్నై 65వ స్థానం, లక్నో 92వ స్థానం దక్కించుకుంది. అలాగే ఈ ఫుడ్‌ జాబితాలో అగ్రస్థానం ఇటలీ వంటకాలు దక్కించుకున్నాయని సదరు కంపెనీ తెలిపింది. మన దేశ ఆహార పదార్థాల్లో పావ్ భాజీ, దోశ, వడాపావ్‌, కబాబ్స్, పానీపురి, బిర్యానీలను అధికంగా ఇష్టపడుతున్నట్లు ప్రకరటించింది. ఇక ఏదీ ఏమైనా మన హైదరాబాద్ విషయానికి వస్తే బిర్యానీకే టేస్ట్ ఫుడ్ అట్లాస్ జై కొట్టిందని చెప్పాలి.

అయితే కొన్ని తరాలుగా ఈ హైదరాబాద్‌ బిర్యానీ పేరు నిలబెట్టుకుంటూ వస్తోంది. వినియోగదారుడు ఆన్ లైన్ ఫుడ్ సంస్థలద్వారా ఆర్డర్ చేసే ప్రతి మూడు వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీ ఒకటిగా నిలిచింది. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో బిర్యానీ తయారీని పూర్వీకులు ఎలా చెప్పారో అదే పద్ధతిలో చేసుకుంటూ వచ్చేవారున్నారు. రెసిపీ సరిగ్గా ఉండటమే దీనికి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

Tags:    

Similar News