దంచి కొడుతున్న ఎండలు

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది

Update: 2023-04-05 07:37 GMT

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో నలభై డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో చిరు జల్లులు కురిసే అవకాశముందని కూడా తెలిపింది.

విద్యుత్ వినియోగం...
ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలు పెరగడం, రాత్రి ఉష్ణాగ్రతల అత్యధికంగా నమోదు అవుతుండటంతో విద్యుత్తు వినియోగం కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ నెల 3వ తేదీన గరిష్టంగా 69.20 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News