పాతబస్తీలో ఉద్రిక్తత.. భారీగా మొహరించిన బలగాలు
హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత తలెత్తింది. అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరగడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి
హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత తలెత్తింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరగడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నిన్న ఢిల్లీకి వస్తుండగా ఒవైసీ కాన్వాయ్ పై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఘటనలో ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారు. అయితే తమ నేతపై కాల్పులు జరిపినందుకు నిరసనగా హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
పాతబస్తీలో బలగాలు...
దీంతో పోలీసులు పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దయెత్తున పోలీసు బలగాలను దించారు. చార్మినార్ ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించింది. ఈరోజు శుక్రవారం కూడా కావడంతో పోలీసు బలగాలను సమస్మాత్మకమైన ప్రాంతాల్లో మరింత పెంచారు. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒవైసీకి జడ్ కేటగిరి భద్రతను కల్పించింది.