మళ్లీ పెరిగిన టమాటా ధరలు.. కిలో వంద రూపాయలకు పైగానే?
టమాటా ధరలు మళ్లీ పెరిగాయి. నిన్నటి వరకూ అరవై నుంచి ఎనభై రూపాయలు పలికిన టమాటా ధర మళ్లీ వందరూపాయలకు చేరుకుంది.
టమాటా ధరలు మళ్లీ పెరిగాయి. నిన్నటి వరకూ అరవై నుంచి ఎనభై రూపాయలు పలికిన టమాటా ధర మళ్లీ వందరూపాయలకు చేరుకుంది. బహిరంగ మార్కెట్ లో టమాటా ధర సెంచరీ దాటడంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. టమాటా ధరలు గత నెల రోజుల నుంచి దిగి రావడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోనూ టమాటా దిగుమతులు లేకపోవడంతో ధరలు దిగి రావడం లేదు.
రైతు బజార్లలో...
రైతు బజార్లలో 70 నుంచి ఎనభై రూపాయలకు రైతులు విక్రయిస్తున్నారు. పంట సెప్టెంబరు నాటికి కాని చేతికి రాదని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు పంట పెద్దగా లేకపోవడంతో ధరలు ఇప్పట్లో దిగి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. మదనపల్లి, పత్తికొండ మార్కెట్ లోనూ వచ్చినవి వచ్చినట్లు టమాటాలను వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేయడం వల్ల ఒక్కసారిగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.