Hyderabad- ఆదివారం.. హైదరాబాద్ వాసులకు కీలక సూచన

అక్టోబర్ 22న హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో

Update: 2023-10-21 05:22 GMT

అక్టోబర్ 22న హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సద్దుల బతుకమ్మ సందర్భంగా లుంబిని పార్కు, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. బతుకమ్మ సంబరాలకు వచ్చే వారికి స్నో వరల్డ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కనే పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. వాహనదారులు అధికారుల సూచనలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు కోరారు.

తెలుగుతల్లి ఫ్లై ఓవ‌ర్, కర్బాలా మైదాన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్‌బండ్ మీదుగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. నల్లగుట్ట నుంచి బుద్ద భవన్‌ వైపు వాహనాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, అంబేద్కర్‌ విగ్రహాం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలకు అనుమతి లేదు. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్ పైకి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్‌ వద్ద బైబిల్‌ హౌస్‌ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్ వైపు మళ్లించనున్నారు. ఎక్బాల్‌ మినార్‌ నుంచి వచ్చే వాహనాలను, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్ వైపు.. పంజాగుట్ట, రాజ్‌భవన్‌ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవ‌ర్‌ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద ఐమాక్స్‌ రూట్‌లోకి డైవర్ట్ చేస్తారు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద రాణిగంజ్‌, నెక్లెస్‌ రోడ్డు వైపు ఈ వాహనాలను డైవర్ట్ చేస్తారు. ఈ వాహనాలు ఇక్బాల్‌ మినార్‌ వైపు వెళ్లి యూ టర్న్‌ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్‌, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్‌పై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ముషీరాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద మళ్లిస్తారు. సికింద్రాబాద్‌ వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ పైకి అనుమతి లేదు. ఆ వాహనాలను డీబీఆర్‌ మిల్స్‌ వద్ద కట్ట మైసమ్మ ఆలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్‌ వైపు డైవర్ట్ చేస్తారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్‌ స్వీకార్‌-ఉపకార్‌ వద్ద డైవర్ట్ చేయనున్నారు. సిటీ బస్సులను కర్బాలా మైదాన్‌ వద్ద మళ్లిస్తారు.


Tags:    

Similar News