హైదరాబాద్ లో పిడుగులు.. కాలిపోయిన టీవీలు, ఫ్రిడ్జ్ లు

నేడు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ. మరోవైపు ఏపీలోనూ..

Update: 2023-07-25 04:46 GMT

strong thunderstorm

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు మరో అల్పపీడనం ఏర్పడటంతో.. తెలంగాణలో జిల్లాలకు రెడ్, ఆరెంజ్,ఎల్లో అలర్ట్ లు జారీ చేశారు. నేడు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ. మరోవైపు ఏపీలోనూ నిన్నటి నుంచి ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షాలు కురిశాయి.

భారీ వర్షంలో హైదరాబాద్ రాజేంద్రనగర్ అత్తాపూర్ లోని నాలుగవ అంతస్తు భవనం సమీపంలో పిడుగు పడింది. భారీశబ్దంతో పడిన పిడుగు ధాటికి స్థానికులు భయ భ్రాంతులకు గురయ్యారు. దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు కానీ.. అత్తాపూర్ డివిజన్ వాసుదేవరెడ్డి నగర్ కాలనీలో పిడుగు ధాటికి ఓ అపార్ట్ మెంట్ లో టీవీలు, ఫ్రిడ్జ్ లతో పాటు లిఫ్ట్ వైర్లు కూడా కాలిపోయాయి. అంటే ఆ పిడుగు ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. అదే ఏదైనా భవనం పడి ఉంటే.. ఎంత ప్రాణనష్టం జరిగేదో ఊహించడానికే భయంకరంగా ఉంటుంది.



Tags:    

Similar News