నేడు ఉజ్జయిని మహంకాళి బోనాలు
ఉజ్జయిని మహంకాళి వారి అమ్మవారి బోనాల పండగ ప్రారంభమైంది. తెల్లవారు జాము నుంచే భక్తులు బోనాలను సమర్పిస్తున్నారు
ఉజ్జయిని మహంకాళి వారి అమ్మవారి బోనాల పండగ ప్రారంభమైంది. తెల్లవారు జాము నుంచే భక్తులు బోనాలను సమర్పిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తొలిబోనాన్ని అమ్మవారికి సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
వీఐపీల రాకతో...
ఈరోజు అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బంగారం బోనాన్ని సమర్పిస్తారు. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా కొద్దిసేపటి క్రితం అమ్మవారిని దర్శించుకునున్నారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారికి దర్శించుకునేందుకు వస్తారు. ఆలయం వద్ద నాలుగు లైన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచే వీఐపీల రాకమొదలు కానుండటంతో పోలీసులు భారీ బందోబసతును ఏర్పాటు చేశారు. భక్తులందరినీ క్యూలైన్లలో దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు.