భవిష్యవాణి ఇదే... వానలు సమృద్ధిగా పడతాయంటూ
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మహా ఘట్టం ముగిసింది.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మహా ఘట్టం ముగిసింది. "రంగం భవిష్యవాణి" అనంతరం అమ్మవారి ఘటం ఊరేగింపు కార్యక్రమం జరిగింది.కోరుకున్నంత వానలు పడతాయి..అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా ఉంటా..ఐదు వారాల పాటు పప్పు బెల్లం సాకలతో ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరారు.
అందరూ సుఖంగా....
అందరూ సుఖంగాఉంటారని, సమృద్ధిగా వానలు కురుస్తాయని చెప్పారు. అలాగే పంటలుకూడా బాగా పండుతాయని "రంగం" భవిష్యవాన్ని తెలిపిన స్వర్ణలత. బంగారం బోనమైనా, మట్టి బోనమైనా తాను సంతోషంగా తీసుకుంటానని చెప్పారు. వ్యాధులు సంక్రమించకుండా ప్రజలనుకాపాడతానని తెలిపారు. ప్రజలను చల్లగా చూస్తానని స్వర్ణలత తెలిపారు. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని తెలిపారు.