భారీ హిమపాతం.. 22 మంది మృతి

పాకిస్థాన్ లోని ప్రముఖ హిల్ స్టేషన్ అయిన ముర్రీలో జరిగిందీ ఘటన. భారీస్థాయిలో మంచు కురవడంతో పలు వాహనాలు

Update: 2022-01-09 05:41 GMT

భారీ హిమాపాతం కారణంగా 22 మంది పర్యాటకులు మృతి చెందారు. పాకిస్థాన్ లోని ప్రముఖ హిల్ స్టేషన్ అయిన ముర్రీలో జరిగిందీ ఘటన. భారీస్థాయిలో మంచు కురవడంతో పలు వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. ఊపిరాడనంత దట్టంగా కార్లపై మంచు పేరుకుపోయింది. దీంతో ఆయా కార్లలో ఉన్న 22 మంది పర్యాటకులు ఊపిరి తీసుకోలేక మరణించారు. మృతుల్లో 9 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. విపరీతమైన మంచు కారణంగా కార్లలోనే గడ్డకట్టుకుపోయి ఆరుగురు మరణించారని, మిగతా వారు ఎలా మరణించారో తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ఇక మంచులోనే కూరుకుపోయిన వందలాది వాహనాలను వెలికి తీశామని, ఇంకా వెయ్యికి పైగా వాహనాలు మంచులోని కూరుకుపోయి ఉన్నాయని తెలిపారు. ఇస్లామాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ముర్రీకి ప్రతి ఏడాది శీతాకాలం సందర్భంగా లక్షలాది మంది పర్యాటకులు తరలివస్తారని… ఇక్కడి హిమపాతం పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. ఈ శనివారం 4 అడుగులకు పైగా మంచు కురవడంతో ఇంత ప్రాణనష్టం జరిగిందని చెప్తున్నారు.


Tags:    

Similar News