కరాచీలో బాంబ్ బ్లాస్ట్.. చైనీయులు స్పాట్ డెడ్

వ్యాన్‌లో ఉన్నవారిలో ముగ్గురు చైనీస్ మహిళలతో సహా కొంతమంది విదేశీయులు ఉన్నారని పాక్ టెలివిజన్ నివేదికలు చెబుతున్నాయి.

Update: 2022-04-26 12:22 GMT

ఏప్రిల్ 26, మంగళవారం నాడు పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. ఒక ప్యాసింజర్ వ్యాన్‌లో పేలుడు సంభవించి నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. అయితే ఈ సంఘటన ఆత్మాహుతి దాడి ఫలితంగా జరిగిందా లేక అమర్చిన పేలుడు పదార్థాల వలన జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. యూనివర్శిటీ క్యాంపస్ సమీపంలో జరిగిన ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. ఇప్పటి వరకూ నలుగురు మరణించారని తెలుసుకున్నాం.. చనిపోయిన వారికి సంబంధించిన గుర్తింపు ఇంకా జరగలేదు అని పోలీసు అధికారి ముఖద్దాస్ హైదర్ విలేకరులతో అన్నారు.

వ్యాన్‌లో ఉన్నవారిలో ముగ్గురు చైనీస్ మహిళలతో సహా కొంతమంది విదేశీయులు ఉన్నారని పాక్ టెలివిజన్ నివేదికలు చెబుతున్నాయి. జియో న్యూస్ ప్రకారం, రెస్క్యూ సిబ్బంది.. పేలుడులో మరణించిన నలుగురిలో ముగ్గురు చైనా జాతీయులుగా గుర్తించారు. మరణించిన చైనా జాతీయులను కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హువాంగ్ గైపింగ్, డింగ్ ముపెంగ్, చెన్ సై, వారి పాకిస్థానీ డ్రైవర్ ఖలీద్‌గా గుర్తించినట్లు నివేదిక తెలిపింది. గాయపడిన ఇద్దరిలో చైనా జాతీయుడైన వాంగ్ యుకింగ్, హమీద్ అనే గార్డుగా గుర్తించారు. ఇంతలో, ఇంకా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.


Tags:    

Similar News