ఇంట్లో 8 మృతదేహాలు.. వారిలో ఆరుగురు చిన్నారులు

మంటల్లో కాలిపోతున్న ఇంట్లో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సదరు వ్యక్తి పోలీసులకు సమాచారమివ్వగా..;

Update: 2022-10-29 08:24 GMT
America crime news, eight people died in house

America crime news

  • whatsapp icon

ఒకే ఇంట్లో 8 మంది మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణ ఘటన అమెరికాలో వెలుగుచూసింది. మృతుల్లో ఆరుగురు చిన్నారులుండటం అందరినీ కలచివేస్తోంది. ఒక్లహామా రాష్ట్రంలోని బ్రోకెన్‌ యారో పట్టణంలో జరిగిందీ దుర్ఘటన. గురువారం సాయంత్రం ఆ ఇంటిలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో..ఇంట్లో ఇద్దరు పెద్దలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా ఆ ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించారు. అప్పుడే ఇంటి ముందు ఓ వ్యక్తి స్పృహలో లేని ఒక మహిళను ఈడ్చుకెళ్తూ కనిపించాడని చెప్పారు.

మంటల్లో కాలిపోతున్న ఇంట్లో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సదరు వ్యక్తి పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అక్కడి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇంట్లో నుంచి పోలీసులు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఇద్దరు పెద్దలు మొదట పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నారా? లేదా వీరందరినీ ఇంకెవరైనా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ఇంటికి నిప్పు పెట్టారా అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన చిన్నారులంతా.. 1 నుండి 13 ఏళ్లలోపు వారే కావడం బాధాకరం.




Tags:    

Similar News