క్రూయిజ్ షిప్ లో కరోనా కలకలం.. 800 మందికి పాజిటివ్
వెంటనే కార్నివాల్ ఆస్ట్రేలియా కంపెనీకి చెందిన మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌకను న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీ తీరంలో..
విహారయాత్రకు బయల్దేరిన ఓ క్రూయిజ్ షిప్ లో కరోనా కలకలం రేపింది. ప్రయాణికుల్లో ఏకంగా 800 మందికి వైరస్ పాజిటివ్ గా తేలడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే కార్నివాల్ ఆస్ట్రేలియా కంపెనీకి చెందిన మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌకను న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీ తీరంలో నిలిపివేశారు. ప్రయాణికులంరినీ అక్కడే క్వారంటైన్లో పెట్టారు. కరోనా బాధితులందరినీ నౌకలోనే ఐసోలేషన్లో ఉంచినట్లు.. నౌక వైద్య బృందం వారికి అవసరమైన చికిత్స అందిస్తోందని కార్నివాల్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
వెంటనే కార్నివాల్ ఆస్ట్రేలియా కంపెనీకి చెందిన మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌకను న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీ తీరంలో నిలిపివేశారు.2020లోనూ న్యూ సౌత్ వేల్స్ లో కరోనా కలకలం రేగింది. రూబీ ప్రిన్సెస్ పేరుతో నడిచే నౌకలో సుమారు 914 మందికి కరోనా సోకగా.. 28 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. పాత అనుభవం నేపథ్యంలో ఇప్పుడు మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌకలో నుండి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చే మార్గాలను పరిశీలిస్తున్నట్లు ఆస్ట్రేలియా అంతర్గత వ్యవహారాల మంత్రి క్లేర్ ఓ నెయిల్ మీడియాకు తెలిపారు.