విమాన ప్రమాదం ..9 మంది మృతి

కరేబియన్ దీవుల్లో డొమినికన్ రిపబ్లిక్ లో ఒక విమానం కూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు.;

Update: 2021-12-16 03:44 GMT
fligt, crash, caribbean islands
  • whatsapp icon

విమానాలు వరస ప్రమాదానిక గురవుతున్నాయి. తాజాగా కరేబియన్ దీవుల్లో డొమినికన్ రిపబ్లిక్ లో ఒక విమానం కూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. విమానం టేకాఫ్ అయిన పదిహేను నిమిషాలకే కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు.

ల్యాండ్ అవుతుండగా....
డొమినకనల్ లోని లా ఇసబల్లా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్లోరిడా వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన 15 నిమిషాల్లోనే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శాంటో డొమింగోలోని లాస్ అమెరికా ఎయిర్ పోర్టులో పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ల్యాండ్ అవుతున్న సమయంలోనే విమానం పేలిపోయింది. విమానంలో ఉన్న వారందరూ మృతి చెందారు. దీనిపై దర్యాప్తు కు ఆదేశించారు.


Tags:    

Similar News